Site icon Prime9

KCR National Party: ఈ నెల 11న జాతీయ పార్టీని ప్రకటించనున్న కేసీఆర్

KCR-National-Party

Hyderabad: తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి రానున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు వేదిక ఖరారు అయ్యింది. హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. ఈ నెల 11న హైదరాబాద్ కు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రానున్నారు. అప్పుడే జాతీయ పార్టీని కేసీఆర్ హైదరాబాద్ లోనే ప్రారంభించి, ఆ తరువాత ఫ్రంట్ లు , పొత్తుల అంశం పై నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

కేంద్రంలో బారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు గత కొద్దికాలంగా కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే ఫ్రంట్ లు, పొత్తుల పై కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. కూటమిలో చేరేందుకు మొదట్లో ఓకే చెప్పిన వారంతా, ఒక్కొక్కరుగా వెనకడుగు వేస్తూ ఉండడంతో కేసీఆర్ స్వయంగా కొత్త జాతీయ పార్టీని స్థాపించి, బిజెపి వ్యతిరేక పోరాటానికి శ్రీకారం చుట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

కేసీఆర్ భారత్ రైతు సమితి పేరుతో కొత్త పార్టీని ప్రకటిస్తారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే అది ఎప్పుడు ఎక్కడ చేస్తారనే విషయంలో ఎవరికీ సరైన క్లారిటీ లేదు. అయితే తాజాగా ఈ అంశం పై ఒక క్లారిటీ వచ్చింది.

Exit mobile version