Site icon Prime9

Kanti Velugu Scheme: తెలంగాణలో జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమం

Kanti Velugu

Kanti Velugu

Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరు, ప్రజారోగ్యం వైద్యం అంశాల పై, సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

కంటి వెలుగు పథకం తిరిగి ప్రారంభించి రాష్ట్రంలోని అందరికీ మళ్లీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వాళ్లందరికి అద్దాలు, మందులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అవసరమున్న వారికి ఆపరేషన్లు కూడా త్వరితగతిన చేయించాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. గతంలో కంటి వెలుగు పథకం అమలైన సందర్భాల్లో వచ్చిన ఆరోపణలు, విమర్శలు తలెత్తగా ఈసారి మాత్రం అలాంటి వాటికి తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం.

కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది. పథకంలో భాగంగా కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి కళ్లద్దాలతో పాటు మందులు కూడా పంపిణీ చేసింది ప్ర‌భుత్వం.

Exit mobile version