Site icon Prime9

Ponguleti Srinivas Reddy : మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు

it raids on congress party leader ponguleti srinivas reddy

it raids on congress party leader ponguleti srinivas reddy

Ponguleti Srinivas Reddy : మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 8 వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు ఖమ్మంలోని ఇల్లు, పాలేరు క్యాంపు కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఐటీ అధికారులు పొంగులేటి అనుచరుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక అదే విధంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసాలపై ఉదయం 6 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. పొంగులేటి రాఘవ కన్ స్ట్రక్షన్స్ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేశారు.

బీఆర్ఎస్ లో ఉన్న పొంగులేటి.. ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ తర్వాత ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. నేడు పొంగులేటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి కుటుంబ సభ్యులందరూ ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. నేడు పొంగులేటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే పొంగులేటి కుటుంబ సభ్యులందరూ ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆ మాటలను నిజం చేస్తూ సోదాలు జరగడం గమనార్హం.

బీఆర్ఎస్ ను వీడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ పై, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పొంగులేటి విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో కాంగ్రెస్ ప్రచార కమిటీ కో- చైర్మన్ గా ఉన్నారు. మాజీ మంత్రి, ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో బుధవారం ఈసీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతల ఇల్లు, కార్యాలయాలపై వరుసగా అధికారులు దాడులు నిర్వహించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కక్షపూరితంగానే ఇలా కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Exit mobile version