Site icon Prime9

IT Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. రూ. 20 లక్షల నగదు స్వాధీనం

IT Raids at brs mls pilot rohith reddy house and 20 lakhs cash seized

IT Raids at brs mls pilot rohith reddy house and 20 lakhs cash seized

IT Raids : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నపధ్యంలో రాష్ట్రంలో ఐటీ శాఖ వరుస దాడులు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తాండూరు అభ్యర్థి పైలెట్‌ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలిసింది. మెుత్తం రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరుడిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలానే  ఇటీవల వరుసగా రాజకీయ నేతలే టార్గెట్‌గా ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు పారిజాత నర్సింహ్మా రెడ్డితో మెుదలైన ఈ దాడులు ఆ తర్వాత కేఎల్ఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులు, జానారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి, రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు గడ్డం వినోద్, వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపారు.

ఇక మరోవైపు హైదరాబాద్ పాతబస్తీలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్, కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లల్లో ఈ ఐటీ సోదాలు జరగుతున్నాయి. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో వీరు నగరంలో ఫంక్షన్‌హాళ్లు, హోటల్స్ నిర్వహిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లుగా ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే సోదాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Exit mobile version