Site icon Prime9

MP Komatireddy Venkatareddy: నల్గొండ జిల్లా రైతులకు అన్యాయం జరగుతోంది.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

MP Komatireddy Venkatareddy: నల్గొండ జిల్లా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు కేటాయిస్తూ జీవో 246 తెచ్చిందన్నారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల ప్రజల మధ్య సీఎం కేసీఆర్ కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు జిల్లాల మధ్య రక్తపాతం జరిగితే దానికి కారణం కేసీఆరే అవుతారని హెచ్చరించారు. జీవో నెంబర్ 246 ని రద్దు చేయకుంటే.. జిల్లా కేంద్రంలో దీక్షకు దిగుతానని తెలిపారు.నీటి విషయంలో నల్గొండ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే.. మంత్రి జగదీష్ రెడ్డి, మండలి చైర్మన్, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్నారు. నల్గొండ జిల్లాకు నీటి కేటాయింపులను తగ్గిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేస్తే.. జిల్లా టీఆర్ఎస్ నేతలు చేతకాని దద్దమ్మల్లా చూస్తున్నారని మండిపడ్డారు.

Exit mobile version