Site icon Prime9

Munugode by poll: తెగ తాగారు.. మునుగోడులో గుట్టలుగా ఖాళీ మద్యం సీసాలు

Heaps of empty liquor bottles in Munugode Constituency

Munugode: మునుగోడు ప ఎన్నికల ప్రచారంలో ఓ మంత్రే స్వయంగా మద్యం పోశారు. మరోవైపు ప్రధాన పార్టీలు నోట్ల కట్టలను నీళ్లలా పంచారు. దీంతో ఖరీదైన ఉప ఎన్నికగా తెలంగాణాలో మునుగోడు రికార్డుకెక్కింది. తాజాగా అందుకు అవునంటూ నియోజకవర్గంలో పలు చోట్ల కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్న మద్యం బాటిళ్లతో సిగ్గుచేటు రాజకీయాలను తలపిస్తున్నాయి.

మందుబాబులు కూడా ఇదే మంచి తరుణం అన్నట్లు, మా ఓటు మీకే అంటూ, తమకు ఖరీదైన బ్రాండ్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఓటర్లు అడగడమే ఆలస్యం అన్నట్లుగా, అభ్యర్థులు కూడా ఖర్చుకు వెనుకాడడం లేదు. దీంతో అత్యధిక ఓటర్లు మద్యాన్ని వాటర్ క్యాన్లలా తాగేస్తున్నారు.

ఇప్పటి వరకూ సుమారు రూ.160కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసేనాటికి రూ.200కోట్లకు పైగా విక్రయాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ.132కోట్ల మేర విక్రయాలు జరిగుతుంటాయి. మునుగోడు ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఉండే ఓటర్లతో పాటూ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లతో కలుపుకొని నెలలో సుమారు రూ.300కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గ పరిధిలో మొత్తం 28 మద్యం దుకాణాలు ఉండగా.. మునుగోడులో అత్యధింకంగా, గట్టుప్పల్‌లో అత్యల్పంగా మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మద్యం విక్రయాలపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ఖాళీ బాటిళ్లను పోస్టు చేస్తూ, ఇదేనా మనం సాధించిన అభివృద్ధి అంటూ ప్రశ్నించారు. మునుగోడులో తాగి పారేసిన మద్యం సీసాల కుప్ప కింద చిక్కి ఉక్కిరి బిక్కిరవుతోన్న ప్రజాస్వామ్యం! జాగోరే జాగో!! అంటూ పోస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికలో భారీ బెట్టింగ్‌లు

Exit mobile version