Harisha Rao: విజయవాడలో శుక్రవారం ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకుర్పాణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇపుడు అటు ఏపీలో..ఇటు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచాయి. సభలో మాట్లాడుతూ రజనీకాంత్ హైదరాబాద్ గురించి ప్రస్తావించారు. ఇటీవల చాలా కాలం తర్వాత హైదరాబాద్ వెళ్లానని.. అపుడు నేను హైదరాబాద్ లో ఉన్నానా? న్యూయార్క్ లో ఉన్నానా అనిపించిందన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని.. ఆయన ఘనత దేశ విదేశాల నాయకులకు కూడా తెలుసునన్నారు. హైదరాబాద్ ను హైటెక్ నగరంగా చంద్రబాబు మార్చారని రజనీకాంత్ అన్నారు.
రజనీ వ్యాఖ్యలపై..(Harish Rao)
అయితే ఇపుడు రజనీకాంత్ చేసిన ఆ కామెంట్స్ రాష్ట్రంలో కాక పుట్టించాయి. ఈ క్రమంలో రజనీ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్ర హరీష్ రావు స్పందించారు. హైదరాబాద్ లో అభివృద్ధి గురించి పక్క రాష్ట్రంలో ఉన్న రజనీకాంత్ కు అర్ధమవుతుంది కానీ.. ఇక్కడ ఉన్న గజనీలకు అర్థం కావడం లేదని హరీష్ అన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ , బీజేపీ లు ముఖ్యమంత్రి కేసీఆర్ ను దించేస్తామని అంటున్నాయని.. అసలు కేసీఆర్ ను ఎందుకు దించాలని హరీష్ ప్రశ్నించారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ ను ఎందుకు దించుతారని నిలదీశారు. రైతకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్.. అందుకు కేసీఆర్ గద్దె దించుతారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్లు ఇచ్చినందుకు కేసీఆర్ ను దించేస్తారా అన్నారు.
కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదు (Harish Rao)
లింగాయత్ లను ఓబీసీల చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపామని తెలిపారు. ఓబీసీలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. లింగాయత్ లను ఓబీసీలో చేర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు. పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా బసవేశ్వరుడి చరిత్ర పెట్టిన ఘనత కేసీఆర్ ది అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.