Site icon Prime9

Harish Rao: అలా అబద్ధాలు చెప్పడం మోదీకి మాత్రమే తెలుసు: హరీష్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటనపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. మోదీ హైదరాబాద్ కు ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం వచ్చినట్టు లేదని.. తెలంగాణపై విషం చిమ్మేందుకే వచ్చినట్టు ఉందన్నారు. ఒక ప్రధానిగా లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పడం మోదీ మాత్రమే చెల్లిందని ఆయన ఎద్దేవా చేశారు.

‘రైతుబంధును కాపీ కొట్టడం వల్ల పీఎం కిసాన్‌ అయ్యింది. ఆ పీఎం కిసాన్‌ స్కీమ్ తోనే మొదటిసారి రైతులకి లబ్ధి అని చెప్పుకోవడం సిగ్గుచేటు. తన వల్లే డీబీటీ ప్రారంభమైనట్టు చెప్పడం పచ్చి అబద్ధం. ఐటీఐఆర్‌ను బెంగళూరుకు తరలించడం నిజం కాదా? రాష్ట్రంలో ధాన్యం కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించడం నిజం కాదా..? పైగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదని చెప్పడం మరింత హాస్యాస్పదంగా ఉంది. అసలు నిజానికి కేంద్రమే రాష్ట్రానికి సహకరించట్లేదు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.

 

ఎందులో అడ్డుకున్నాం: వేముల ప్రశాంత్‌రెడ్డి(Harish Rao)

తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని తన ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధిని ప్రభుత్వం అడ్డుకుందనడం విడ్డూరంగా ఉందని మరో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఏ అభివృద్ధి లో అడ్డుకున్నాం.. కేంద్రం పసుపు బోర్డు ఇస్తానంటే అడ్డుకున్నామా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన కానేకాదని.. ఆయనది ఉద్యమ నేపథ్య కుటుంబమన్నారు. కేసీఆర్‌కు ప్రజల ఆమోదం బాగా ఉందని.. మోదీ అంత క్లీన్ అయితే వేల కోట్లు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీపై ఈడీ, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

 

Exit mobile version