Site icon Prime9

Koppula Narsimha reddy: భాజాపా కార్పొరేటర్ పై విద్వేష పూరిత కేసు

Harassment case against BJp corporator:

Harassment case against BJp corporator:

Hyderabad: మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేసారు. పోలీసులపై దాడులు చేయాలంటూ సోషల్ మీడియాలో విద్వేష పూరిత కేసులు పెట్టారన్న కేసులో ఆయన పై ఎల్బీనగర్ పిఎస్ కేసు నమోదైంది. పశ్చిమ బెంగాల్ లో జరిగిన హింసాత్మక ఘటనలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో విధ్వంసానికి ప్రేరింపాచారని అభియోగాలతో కార్పొరేటర్ పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి.

జాతీయ స్థాయిలో సిఎం కేసీఆర్ దృష్టి పెట్టడంతో పాటు కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలను ఒకటిగా తీసుకొచ్చేందుకు చేస్తున్న టిఆర్ఎస్ ప్రయత్నాల్లో భాగంగానే తాజా కేసు నమోదు చేసిన్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ జాతీయ స్థాయి పార్టీ ప్రతిపాదనను బెంగాల్ సీఎం మమత పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో భాజాపా కార్యకర్తలపై సోషల్ మీడియా కేసులు నమోదు చేస్తే కొంతైనా ప్రతిపక్షలను తనవైపు తిప్పుకొనేందుకువ అవకాశాలు ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే పొరుగు రాష్ట్రమైన ఏపి సిఎం ను మాత్రం జాతీయ స్థాయి పార్టీలో తనకు మద్దతు ఇవ్వమని ఆయన అడగడం లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబును సైతం ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. కాబట్టే ఇతర రాష్ట్రాల నేతలు కేసీఆర్ పట్ల పెద్దగా సుముఖంగా లేరని తెలుస్తుంది. కేసీఆర్ ధ్వంద్వ వైఖరిని నిశతంగా పరిశీలిస్తున్నారు.

Exit mobile version