Site icon Prime9

Hyderabad: తెలంగాణ విద్యార్దులకు గుడ్ న్యూస్.. ఇంటర్ తోనే ఐటీ జాబ్స్

inter

inter

Hyderabad: తెలంగాణ సర్కార్ ఇంటర్మీడియట్ అర్హతతోనే ఐటీలో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రతి ఏడాది 20 వేల మంది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు  ఈ అవకాశం దక్కనుంది. ఈ మేరకు ప్రముఖ కంపెనీ హెచ్‌సీఎల్‌తో ఒప్పందం కుదిరింది.

ఇంటర్‌ సెకండియర్‌లో మ్యాథ్స్‌ సబ్జెక్టు విద్యార్థులకు ఫిబ్రవరిలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందులో 60 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. తర్వాత ఎంపికైన విద్యార్థులకు ఆన్ లైన్‎లో 6 నెలల పాటు శిక్షణ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కార్యాలయంలో ఆరు నెలలపాటు ఇంటర్న్‌షిప్‌ కోసం అవకాశం కల్పించి ప్రతినెలా రూ.10 వేలు స్టైఫండ్ ఇస్తారు. ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాక రూ. 2.5 లక్షల వార్షిక వేతనంతో పర్మినెంట్‌ ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తూ బిట్స్‌, శాస్త్ర, అమిటి యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ పూర్తి చేసే అవకాశం ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఈ అవకాశం ప్రభుత్వ కళాశాలల్లో చదుకున్నవారికి మాత్రమే. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు ఇన్‌ఛార్జి కార్యదర్శి నవీన్‌మిత్తల్‌తో సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు.

 

Exit mobile version
Skip to toolbar