Site icon Prime9

Etela Rajender: బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇంట విషాదం

etela-rajender-father-etela-malliah-dies-due-to-health-issues

Etela Rajender: బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి స్వర్గస్తులయ్యారు . మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉండగా ఈటల రాజేందర్ రెండో కుమారుడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాదులోని ఆర్విఎం ఆస్పత్రి మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తుండగా మంగళవారం రాత్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన మరణించారు. ఈ వార్తను ఈటెల కుటుంబీకులు ధ్రువీకరించారు.

హనుమకొండ జిల్లా కమలాపూర్ లోని స్వగ్రామంలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.ఈటెల మల్లయ్య మృతితో కమలాపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లయ్యను చూసేందుకు, ఈటెలను పరామర్శించేందుకు బీజేపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.

Exit mobile version