Site icon Prime9

National Herald Case: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

ED notices to Telangana Congress leaders

ED notices to Telangana Congress leaders

Hyderabad: నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసింది. పార్టీకి, అనుబంధ సంస్ధలకు విరాళాలు ఇచ్చిన వారికి నోటీసులు జారీ చేసిన్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏఐసిసి నుండి పిలుపు వచ్చింది. ఇప్పటికే కొంతమంది నేతలు ఢిల్లీ చేరుకొన్నారు. తాజాగా నేడు మరి కొంత మంది నేతలు ఢిల్లీకి బయల్దేరారు.

వీరిలో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లు ఉన్నట్లు సమాచారం. కేసుపై ఆడిటర్లతో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారించి వుంది. న్యాయపరమైన, లెక్కల పరంగా సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: అక్టోబర్ 1న భాజాపా ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ రాక

 

Exit mobile version