Site icon Prime9

Munugode by poll: మునుగోడు రిటర్నింగ్ అధికారి పై ఈసీ వేటు.. ఓ పార్టీ అభ్యర్ధి గుర్తు మార్చడంతో ఈసీ సీరియస్

EC who transferred the Munugode Returning Officer

EC who transferred the Munugode Returning Officer

Munugode: ఓ అభ్యర్ధి గుర్తు మార్చిన మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో)పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. దీంతో కొత్త ఆర్వో ఎంపిక పై మూడు పేర్లను అధికారులు ఈసీకి పంపారు. నేటి సాయంత్రానికి కొత్త ఆర్వో పేరును ఈసీఐ ప్రకటించనుంది.

యుగతులసి పార్టీ అభ్యర్ధి కె. శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తును తొలుత కేటాయించారు. అనంతరం బేబీ వాకర్ గుర్తుకు మార్చడంతో ఆయన ఈసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్వో నిర్ణయాన్ని ఈసీ తప్పు బట్టింది. ఈసీ ఆదేశాలతో ఫారం 7(ఎ)ను ఎన్నికల అధికారులు సవరించి, రోడ్డు రోలర్ గుర్తును యుగతులసి పార్టీ అభ్యర్ధికి కేటాయించిన్నట్లు కూడా పేర్కొన్నారు.

అయితే అనూహ్యంగా మార్పు చేసిన కొద్ది గంటల్లోనే ఆర్వో పై ఈసీ బదిలీ వేటు వేయడంతో రాజకీయ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఇది కూడా చదవండి: Election commission: గుర్తు కేటాయించారు.. ఆపై మార్పు చేశారు.. మునుగోడు రిటర్నింగ్ అధికారి పై ఈసీ సీరియస్

Exit mobile version