Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో ఈడీ అధికారుల తనిఖీలు చేపట్టారు. 25 బృందాలుగా ఏర్పడి ఈడీ సోదాలు చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు ముంబు, బెంగళూరు వంటి నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చి మండలం రేబాల గ్రామంలో ఈడీ సోదాలు కలకలం రేపాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఇప్పటికే జిల్లాలోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కార్యాలయాలు, ఇళ్లు, సమీప బంధువుల ఇళ్లలో ఈడీ సోదరుల నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేబాల గ్రామంలోని ఎంపీ మాగుంట సమీప బంధువు, వైసీపీ నేత ఏటూరి శివరామకృష్ణారెడ్డి నివాసానికి ఈడీ అధికారుల ప్రత్యేక బృందం చేరుకొని సోదాలు నిర్వహించారు. సిఆర్పిఎఫ్ సిబ్బంది భద్రత మధ్య నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు. దీంతో ఈడి సోదాలు వ్యవహారం స్థానికంగా చర్చినియాంశమైంది.
మాదాపూర్ లోని అనుస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనూస్ బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి. మాదాపూర్ లోని అలైఖ్య ప్రవణవ్ హోమ్స్ లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి నలుగురు ఈడి అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహిస్తోంది.
సంచలనంగా నిలిచిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ వేగవంతం చేసింది. కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారి ఇళ్లుకార్యాలయాల పై ఏకకాలంలో దాడులు చేస్తోంది. హైదరాబాద్‌తోపాటు ముంబు, బెంగళూరు వంటి నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. అయితే, ఈ కేసులో ముందునుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీలోని మనీష్ సిసోడియా ఇంట్లో మాత్రం ఎలాంటి సోదాలు చేయడం లేదని ఈడీ తెలిపింది. మరోవైపు ఈ కేసుతో సంబంధం లేదని మనీష్ సిసోడియా చెప్తున్నారు.