Site icon Prime9

Crime News :మహబూబ్ నగర్ లో సీఐ మర్మాంగాలను కోసేసిన కానిస్టేబుల్.. పరిస్థితి విషమం

Crime News about constable attack on ci at mahabubnagar

Crime News about constable attack on ci at mahabubnagar

Crime News : మహబూబ్‌నగర్‌ సీసీఎస్‌ సీఐ ఇఫ్తికార్‌ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. స్థానికంగా ఓ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌.. సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనను హానీ ట్రాప్ అనే కోణంలో కూడా పలు మీడియా సంస్థలు ప్రచురించడం గమనించవచ్చు.

అయితే ఈ ఘటనలో సీఐ మర్మాంగాలను కోయడంతో పాటు ఆయన తలపై బలమైన ఆయుధాలతో నిందితుడు దాడి చేశాడు. దీంతో సీఐను తొలుత జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈఎస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సీఐ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

నిందితుడి భార్య కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆమె మహబూబ్‌నగర్‌లోనే ఓ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారని సమాచారం అందుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జోగులాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, ఎస్పీ హర్షవర్ధన్‌, అదనపు ఎస్పీ రాములు తదితరులు జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈఎస్‌ ఆస్పత్రికి వచ్చి సీఐను పరామర్శించారు. హత్యాయత్నం జరిగేందుకు గల కారణాలపై మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్పారు. కాగా పోలీసు వ్యవస్థలోని వారే నిందితులు, బాధితులు కావడం పట్ల ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ ఘటన వివాహేతర సంబంధం నేపధ్యంలో జరిగిందా.. లేక హనీ ట్రాప్ లో భాగంగా జరిగిందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం సీఐ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Exit mobile version