Site icon Prime9

CPI Narayana: తమిళిసై ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం చదివింది.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

cpi-narayana

cpi-narayana

Hyderabad: తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం చదివిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. యూనివర్శిటీ బిల్లులను ఆపే హక్కు గవర్నర్ కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. బిల్లులపై మంత్రులు గవర్నర్ కు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అనుమానం ఉంటే గవర్నర్ అధికారులతో మాట్లాడుకోవాలన్నారు. బిల్లులను ఎక్కువకాలం పెండింగ్ లో పెట్టాల్సిన అధికారం గవర్నర్ కు లేదన్నారు.

గవర్నర్లతో కేంద్రం రాష్ట్రాలను ఇబ్బందిపెడుతుందన్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థతో నష్టమే తప్ప లాభం లేదని ఆయన చెప్పారు. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ తో కలిసి పనిచేసినట్టుగా ఆయన తెలిపారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులుండరని అన్నారు.

సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ జరిగితే కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ఇలాంటి మాటలు మాట్లాడడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Exit mobile version