Site icon Prime9

YS Sharmila: షర్మిల పై స్పీకర్ కు ఫిర్యాదు

Complaint-to-Speaker-on-Sharmila

Hyderabad: పాద‌యాత్ర‌లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల‌పై ష‌ర్మిల పదే పదే అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని స‌ద‌రు ఫిర్యాదులో ఎమ్మెల్యేలు ఆరోపించారు. నిరాధార ఆరోప‌ణ‌ల‌తో పాటు వ్య‌క్తిగ‌త విమర్శ‌లు చేస్తున్న ష‌ర్మిల త‌మ ప్రతిష్ఠ‌కు భంగం క‌లిగిస్తున్నార‌ని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార ఆరోపణలు, జుగుప్సాకర ఆరోపణలు చేస్తున్నారని ఆమె పై ఫిర్యాదు చేసారు.

భాజాపా నేత, ఎంపీ బండి సంజయ్ చేస్తున్న సంగ్రామ యాత్రను పోలీసులతో పదే పదే అడ్డుకొన్న టిఆర్ఎస్ పార్టీ నేతలు షర్మిల విషయంలో తొలి నుండి మౌనంగానే ఉండిపోయారు. తాజాగా ఈ మద్య కాలంలో షర్మిల పై పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ కొంతమంది టిఆర్ఎస్ పార్టీ నేతలు ఆమెను హెచ్చరిస్తున్నారు. ఇప్పడు నిర్ణయం మీదేనంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్ నేతలు, బండి సంజయ్ విషయంలో మాత్రం పెద్ద రచ్చ రచ్చ చేయడంపై పలువరు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కు కేసిఆర్ కు సత్సంబంధాలతోనే షర్మిలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న గుసగుసలు లేకపోలేదు.

Exit mobile version
Skip to toolbar