CM Kcr : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వాడివేడిగా మారాయి. ఈ క్రమం లోనే అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఈరోజు నుంచి రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. ఈరోజు నుంచి నవంబర్ 9 వ తేదీ వరకు వరుసగా బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
కాగా ఇవాళ ఒక్కరోజే మూడు సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ముందుగా అచ్చంపేటలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని.. ఆ తర్వాత వనపర్తి, మునుగోడులో ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం అచ్చంపేటలో కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. కేసీఆర్ దమ్ము ఏంటో ఇండియా అంతా చూసింది. మీరంతా కేసీఆర్ దమ్ము(ప్రజలను ఉద్దేశించి).. ఈ దమ్ము గట్టిగా బయల్లెలుతే దుమ్ము దుమ్ము లేస్తది. లెవ్వాలి. నవంబర్ 30న దుమ్ము రేగాలి. బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో బాలరాజు గెలిచి రావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ కోసం తాను బయలుదేరి 24 ఏళ్లు అయిందని.. తాను తెలంగాణ కోసం బయలుదేరిన సమయంలో ఎవరూ లేరన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు లేని వారంతా ఇవాళ తనకు సవాళ్లు విసురుతున్నారన్నారు. కొంతమంది ఇప్పుడొచ్చి కేసీఆర్ కు దమ్ముందా అని అంటున్నారని చెప్పారు. కొడంగల్ కు రా, గాంధీ బొమ్మ దగ్గరకు రా అని సవాళ్లు చేస్తున్నారని.. రాజకీయమంటే ఇలాంటి సవాళ్లా అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ సాధన కోసం తాను ఒక్కడినే పక్షిలా తిరిగినట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు. కొడంగల్ కు, గాంధీ బొమ్మకు రావాలని సవాల్ చేస్తున్న సిపాయిలంతా ఆనాడు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటిదాకా తాను పోరాటం చేసినట్టుగా కేసీఆర్ చెప్పారు.ఇకపై పోరాటం చేయాల్సింది మీరేనని ఆయన ప్రజలను కోరారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోడీ గుజరాత్ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ లేదన్నారు. మీకోసం ప్రత్యేకంగా అక్కడి నుంచి ప్రత్యక్షప్రసారం..