Site icon Prime9

CM Kcr : మధిర ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ కి వచ్చేది 20 సీట్లే అంటూ జోస్యం !

CM Kcr shocking comments on congress party at madhira meeting

CM Kcr shocking comments on congress party at madhira meeting

CM Kcr : తెలంగాణలో ఎన్నికల సమరంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు.. అధికారం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరుస మీటింగ్ లతో ప్రజలతో మమేకం అవుతున్నారు. అందులో భాగంగా మంగళవారం మధిర నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌లో 20 మంది సీఎంలు ఉన్నారని.. వారికి వచ్చడి 20 సీట్లే అంటూ కేసీఆర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ తీసుకొచ్చేది భూమాతానా, భూమేతనా అని ప్రశ్నించారు.

అలానే మాట్లాడుతూ.. పదేళ్లలో ఎక్కడా పంటలు ఎండలేదని సీఎం గుర్తుచేశారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో వుందని.. ఎవరూ అడగకున్నా దళితబంధు ఇస్తున్నామని  చెప్పారు. భట్టి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని సీఎం చురకలంటించారు. భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదని అన్నారు. పట్టు లేని భట్టి విక్రమార్క నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వస్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అభ్యర్ధి గెలుపు బట్టే ప్రజల భవిష్యత్ వుంటుందని.. తెలంగాణ ఇవ్వడంలో అనేకసార్లు డోకా చేశారని కేసీఆర్ మండిపడ్డారు. చిత్తశుద్ధి, కమిట్‌మెంట్‌తో పనిచేశామని సీఎం తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే ఖమ్మం జిల్లాలో మరిన్ని ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని కేసీఆర్ వెల్లడించారు.

ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని.. రాయి ఏదో, రత్నం ఏదో ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ (CM Kcr) పిలుపునిచ్చారు. రిజల్ట్స్ రోజున దుకాణం క్లోజ్ కాదు.. ఆ రోజే ప్రారంభమవుతుందని సీఎం అన్నారు. ప్రజలపై ప్రేమతో కాదు.. ప్రత్యేక పరిస్ధితుల్లోనే తెలంగాణ ఇచ్చారని కేసీఆర్ గుర్తుచేశారు. పదేళ్లుగా ఒల్లు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. తమ ప్రత్యర్ధి కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లోనూ అభివృద్ధి చేశామని ధీమా వ్యక్తం చేశారు.  అధికారంలోకి రాగానే కాంగ్రెసోళ్లు ఇస్తున్న రూ.200 పెన్షన్‌ను రూ.1000 చేసినం. తర్వాత రూ.2 వేలకు పెంచినం. భవిష్యత్తులో దాన్ని రూ.5 వేలకు పెంచబోతున్నం అని చెప్పారు.

కాంగ్రెస్‌ నేతలు రైతుబంధు వేస్ట్‌ అంటున్నరని, 24 గంటల కరెంటు అవసరమే లేదని చెప్తున్నరని, ధరణి పోర్టల్‌ తీసి బంగాళాఖాతంల పడేసి దాని స్థానంలో భూమాత తెస్తమంటున్నారని, ఇన్ని తల్కాయలేని మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలను నమ్మి ఓటేస్తే మోసపోతరని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధర ఓటర్లను హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తేనే రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతదని చెప్పారు. ఎకరానికి రూ.10 వేలు ఉన్న రైతు బంధును ఎకరానికి రూ.16 వేలకు పెంచబోతున్నామని స్పష్టం చేశారు. మధిరల కమల్‌రాజ్‌ను గెలిపించాలె అని కోరారు.  కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినం. 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చినం. ఈ 80 లక్షల అద్దాలు మాయి ఉండంగ కాంగ్రెస్‌ ఎట్ల గెలుస్తదండి..?’ అని సీఎం ఓటర్లను ప్రశ్నించారు.

Exit mobile version