Site icon Prime9

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం.. అభిషేక్ రావును అరెస్ట్ చేసిన సీబీఐ

CBI

CBI

Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అభిషేక్ రావు నివాసంలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అదే విధంగా పలుమార్లు ప్రశ్నించారు. అభిషేక్ రావు అనూస్ బ్యూటిపార్లర్ అధినేతగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా రాబిన్ డిస్టిలర్స్ లో ఎండిగా ఉన్నారు. ఈ కుంభకోణం కేసులో ఇప్పటికే విజయ్ నాయర్, సమీర్ మహేంద్రును సీబీఐ అరెస్ట్ చేసింది.

రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్లలో అభిషేక్ ఒకరు. ఈ ఏడాది జూలై 12న ఈ కంపెనీని స్థాపించారు. ఢిల్లీకి చెందిన జీఎన్‌సీడీటీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల పై కొనసాగుతున్న విచారణలో అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

దక్షిణ భారతదేశంలోని కొంతమంది మద్యం వ్యాపారుల కోసం లాబీయింగ్ చేస్తున్న అభిషేక్ బోయిన్‌పల్లిని ఆదివారం విచారణకు పిలిచినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. కొన్ని కీలక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నట్టుగా సీబీఐ గుర్తించిందని, దీంతో గత రాత్రి అదుపులోకి తీసుకున్నామని వారు తెలిపారు. నిందితుడిని సంబంధిత కోర్టులో హాజరు పరచనున్నారు.

 

Exit mobile version