Site icon Prime9

BRS formation day: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరపాలి: కేటీఆర్

BRS formation day

BRS formation day

BRS formation day: భారత రాష్ర్ట సమితి(BRS)ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. ఈ నెల 27 న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 27 వ తేదీన పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశ పెట్టి చర్చించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 25 న నియోజక వర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు జరుగుతాయి. అక్టోబర్ 10 వ తేదీ వరంగల్ లో బీఆర్ఎస్ భారీ మహాసభ నిర్వహించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

గ్రామ గ్రామాన ఆత్మీయ సమ్మేళనాలు(BRS formation day)

మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నియోజక వర్గ స్థాయి సమావేశాలు పార్టీ నియమించిన ఇంఛార్జ్‌లు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతుందని కేటఆర్ తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను కో ఆర్డినేషన్ చేస్తారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయం పార్టీ జెండాలు ఎగరవేయాలని తెలిపారు. గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమం తర్వాత ఉదయం 10 గంటలకు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతినిధులు సభలు జరిగే స్థలికి చేరుకోవాలని కోరారు. సమావేశాలకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు అవసరమైన భోజనాలు, ఇతర వసతులు ఏర్పాటు చేయాలన్నారు. వేసవి నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లకు కేటీఆర్‌ సూచించారు.

 

3 నియోజక వర్గాలకు ఇంఛార్జ్‌ లు

అదే విధంగా మూడు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంఛార్జ్‌గా మర్రి రాజశేఖర్ రెడ్డి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఎంపీ మాలోతు కవిత, గోషామహల్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నంద కిషోర్ వ్యాస్ బిలాల్ లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరు ప్రస్తుతం కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు నిర్వహణ, నియోజకవర్గాలకు బాధ్యతలు చూస్తారు.

Exit mobile version