Site icon Prime9

Munugode by poll: మునుగోడు ఓటర్ల నమోదు పై భాజపా పిటిషన్

BJP's petition on voter registration

BJP's petition on voter registration

Hyderabad: తెలంగాణలో మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో రికార్డులు చోటుచేసుకొంటున్నాయి. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కీలకం కానున్న మునుగోడు ఉప ఎన్నికలతో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు పోతున్నాయి. ఈ నేపధ్యంలో మునుగోడు లో కొత్త ఓటు హక్కు, చిరునామా బదిలీల రూపంలో రికార్డు స్థాయిలో 25వేలకు పైగా దరాఖస్తులు చేసుకొన్నారు. ఇదంతా రాజకీయ దురుద్ధేశంతోనే ఇన్ని దరాఖాస్తులు నమోదు చేసుకొంటున్నారని భాజపా తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉంటున్నవారు స్థానికం పేరుతో మునుగోడుకు మార్చాలంటూ ఎన్నికల కమీషన్ కు ఫాం 6 ద్వారా దరాఖాస్తులు చేసుకొని వున్నారు. అయితే ఇందులో అక్రమ ఓటర్లు కూడా ఉన్నారనేది భాజపా వాదన. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో ఓటు హక్కు కావాలనుకొనే వారి సంఖ్య లేకపోవడంతో పాటు, అధికార పార్టీ వేసిన పన్నాగంలోనే ఓటర్లు దరఖాస్తులు చేసుకొన్నారంటూ భాజపా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది.

14వ తేదీన కలెక్టర్ అధ్యక్షతన కొత్త ఓటర్లు లిస్ట్ ను ప్రకటిస్తారు. దాన్ని నిలుపదల చేయాలని భాజపా పిటిషన్ లో కోరింది. అనుమానాలకు తావిచ్చేలా చోటుచేసుకొన్న దరాఖాస్తులు సంఖ్య 25వేలకు చేరుకొన్న నేపధ్యంలో జూలై నెలలోని ఓటరు లిస్ట్ ను పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొనింది. దీనిపై 13వ కోర్టు విచారణ జరపనుంది.

మరో వైపు అధికార పార్టీ కూడా భాజపా శ్రేణులు కొత్త ఓటర్లు, చిరునామా మార్పుల పేరుతో దరఖాస్తులను వేలల్లో చేపడుతున్నారని ఆరోపించింది. మొత్తం మీద పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొంటున్నా ఒక్క విషయం మాత్రం నిజమని చెప్పాలి. మునుగోడు ఎన్నికల్లో మద్యం, నగదు, ఇతరత్రా తాయిళాలను ప్రకటిస్తూ, కోట్లలో డబ్బులు వెదజల్లేందుకు రెడీ అయ్యారనేది ఖచ్ఛితం. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన మంత్రి మల్లా రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఏకంగా మద్యంను గ్లాసులో పోసి మరీ తాగించిన సంగతి అందరికి విధితమే. అధికారం కోసం తెరాస, గెలుపు కోసం ప్రతిపక్షాలు పోటీపడి మునుగోడు ఎన్నికల్లో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. చివరకు ఓటరు మహాశయల నిర్ణయమే అంతిమం కావడంతో నవంబర్ 6వరకు అన్ని పార్టీలు వేచి ఉండాల్సిందే.

ఇది కూడా చదవండి: ఉప ఎన్నికలో ట్విస్ట్.. గ్లాసులో మద్యం పోస్తూ బుక్కయిన మంత్రి మల్లా రెడ్డి

 

Exit mobile version