Site icon Prime9

GHMC Council Meeting: చార్మినార్ జోన్ లో పన్నుల రాబడి 50 శాతమే

Tax revenue in Charminar zone is 50 percent

Tax revenue in Charminar zone is 50 percent

Hyderabad: భాగ్యనగరంలో హైదరాబాదు మహానగర పాలక సంస్ధ (జీహెచ్ఎంసీ) పన్నుల రాబడిని పెంచడం పై దృష్టి సారించడం లేదని, ఛార్మినార్ జోన్ లో 50శాతం మాత్రమే పన్నులు వసూల కావడం పై భాజపా కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఆధ్యంతం పొగడ్తలు, కామిడీ షోలను తలపిస్తూ రసాభాసగా మారింది.

టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేసి కార్పొరేటర్ల అంశం పై గొడవ తలెత్తింది. టీఆర్ఎస్ లోకి చేరిన కార్పొరేటర్లను మన్నే కవిత పొగడడంతో భాజాపా కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సిద్ధాంతాలు నచ్చడంతో తాను టీఆర్ఎస్ లోకి చేరిన్నట్లు కార్పొరేటర్ బాబా ఫసియుద్ధీన్ పేర్కొన్నారు. దీనికి భాజాపా వర్గం నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. భాజాపా కార్పొరేటర్లు మేయర్ పోడియం ను చుట్టుముట్టడంతో మేయర్ 5 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.

అనంతరం పన్నుల రాబడి పై చర్చ జరిగింది. ఎల్బీ నగర్ జోన్ నుండి 284కోట్లు ప్రజలు పన్నులు వసూలు చేసిన్నట్లు అధికారులు లెక్కలు చూపించారు. అయితే ఛార్మినార్ జోన్ కు సంబంధించి కేవలం 102 కోట్లు మాత్రమే వసూలు అవడం పట్ల కొంతమంది కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పన్నులు రాబడిని బట్టి ఆ ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

జీహెచ్ఎంసీకి 1996 నుండి బకాయి పడ్డ ప్రభుత్వ భవనాల పన్నుల రాబడి పై కూడా చర్చ జరిగింది. 3వేల కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉన్నట్లు కమీషనర్ లోకేష్ కుమార్ సభకు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వ బకాయిల రాబడిని ఎలా చేపట్టాలన్న విషయం పై కొలిక్కి రావడం లేదని తెలిపారు.

బల్దియా సమావేశాలు కామెడీ షోలుగా మారాయని కాంగ్రెస్ కార్పొరేటర్ విజయారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, సీఎం, ఆయన కుమారుడు కేటీఆర్ భజనలకే సభా సమయం సరిపోతుందని ఆమె ఎద్దేవా చేశారు. అలాంటి వారి పై చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు.

Exit mobile version