Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణాలో రాజకీయల విలువలు దిగజారాయి. ప్రత్యర్దులపై మాటలు తూటాలు సాగడం ఒక ఎత్తైతే, ఏకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాజకీయాలను అపహస్యం చేస్తున్నారు. తాజాగా భాజపా అధ్యక్షులు బండి సంజయ్ రాజీనామా చేసిన్నట్లు సృష్టించిన ఓ ఫోర్జరీ లేఖ నెట్టింట వైరల్ అయింది. తెరాస శ్రేణులు జగుప్సాకరంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీలకు విజయం వరించకుండా ప్రవర్తించడాన్ని రాజకీయ నేతలు తప్పుబడుతున్నారు.
వైరల్ అయిన రాజీనామా లేఖ పై బండి సంజయ్ వివరణ ఇస్తూ దొంగ పాస్ పోర్టులు సృష్టించిన వారికి ఫోర్జరీ లేఖలు సృష్టించడం పెద్ద కష్టం కాదని సీఎం కేసిఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస ఓడిపోతుందని తెలిసి ఇలాంటి నకిలీ లేఖలు సృష్టించి అభాసుపాలైనారని గుర్తుచేశారు. అంటే మునుగోడులో కూడా తెరాస ఓడిపోతుందని ఆ పార్టీ శ్రేణులు గుర్తించబట్టే తాను రాజీనామా చేసిన్నట్లు లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం కావడమే నిదర్శనమన్నారు. మునుగోడులో భాజపా అభ్యర్ధి ఓడిపోతున్నందునే రాజీనామా చేస్తున్నట్లు వైరల్ అయిన నకిలీ లేఖ వ్యవహరం పై ఎన్నికల కమీషన్ కు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బండి సంజయ్ మీడియాతో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Union minister Kishan Reddy: వ్యూహం ప్రకారమే ఈటెల పై దాడి జరిగింది.. కిషన్ రెడ్డి