Site icon Prime9

BJP Leaders Meet Governor: గవర్నర్ తమిళిసైను కలిసిన బీజేపీ నేతలు

Hyderabad: తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను క‌లిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి, తగిన భద్రత కల్పించేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం అందించారు. నిన్న హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు జరిపిన దాడిపై విచారణ జరిపించేలా పోలీసుల‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు.

జనగాంలో ప్రజా సంగ్రామ యాత్ర పై దాడికి ఘటన పై విచారణ జరిపించాలని కోరారు. బండి సంజయ్ అక్రమ అరెస్టు, యాత్ర అడ్డగింతకు దారితీసిన పరిస్థితుల పై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ రెచ్చగొట్టేందుకు ఎంతలా ప్రయత్నించినా, బిజెపి కార్యకర్తలు సంయమనం పాటించారని గవర్నర్ కు వివ‌రించారు. గవర్నర్ ను క‌లిసిన వారిలో ఎంపీ లక్ష్మణ్, విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, రఘునందన్ రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.

Exit mobile version