Site icon Prime9

Amit Shah : ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే తెలంగాణకు బీజేపీ కేంద్రమంత్రి అమిత్ షా..

bjp leader and central minister amit shah hyderabad tour schedule

bjp leader and central minister amit shah hyderabad tour schedule

Amit Shah : బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ రానున్నారు.సెప్టెంబర్ 17న జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు. అయితే 16నే ఆయన హైదరాబాద్ రానున్నారు. అదేరోజు రాత్రి తెలంగాణ బీజేపీ నాయకులతో ఆయన భేటీ అవుతారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యాచరణపై తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ మేరకు షెడ్యూల్ వివరాలు..

16వ తేదీ రాత్రి 7.55 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు

రాత్రి 8.15 గంటలకు హైదరాబాద్ లోని సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్ కు చేరుకుని రాత్రికి బస చేస్తారు

17వ తేదీ ఉదయం 8.35గంటకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు

ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన ఉత్సవాల్లో పాల్గొంటారు

ఉదయం 11.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరతారు

ఉదయం 11.50 నిమిషాలకు ఢిల్లీకి పయనమవుతారు

 

Exit mobile version