Site icon Prime9

Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

fire accident prime9news

fire accident prime9news

Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘రూబీ లగ్జరీ ప్రైడ్‌’ 5 అంతస్థుల బిల్డింగ్ గ్రౌండ్‌ ఫ్లోర్లో ‘బగాస్ ఈవి ప్రైవేట్ లిమిటెడ్’ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూం నుంచి ఎలక్ట్రిక్‌ బైక్ బ్యాటరీలు పేలి ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడ ఉన్న వాహనాలకు కూడా అంటుకున్నాయి. ఈ ఘటన నిన్న రాత్రి 09:40 నిముషాలకు జరిగింది.

గ్రౌండ్ ఫ్లోర్ మంటలు, పొగ మెట్ల నుంచి పై ఫ్లోర్ కూడా వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో, వాళ్ళు అక్కడికి అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. లాడ్జిలో మొత్తం 23 గదులు ఉన్నాయి. వాటిలో 25 మంది లోపలే ఉన్నారు. ఈ ఘటన వల్ల కరెంట్ ను నిలిపివేశారు. ఈ మంటలు వల్ల ఇంక ఏం జరుగుతుందో అని ఆందోళన చెందారు. లాడ్జిలో ఉన్న వాళ్ళలో కొంతమంది పొగ కారణంగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఊపిరి ఆడక అక్కడే పడిపోయారు. వాళ్ళలో 7 గురు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాలను కాపాడుకోవడానికి నలుగురు కిందికి దూకి వారిలో ముగ్గురు గాయాలపాలయ్యారు.

గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి వాళ్ళకి వైద్యాన్ని అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిసిన సమాచారం. చనిపోయిన వారిలో ఆరుగురు పురుషులు ఒక మహిళ ఉన్నారు. చనిపోయిన వారిలో విజయవాడకు చెందిన ఎ హరీశ్‌, చెన్నైకి చెందిన సీతారామన్‌,ఢిల్లీ కి చెందిన వీతేంద్రను గుర్తించారు. మిగిలిన వారు ఏ ఊరు వాసులని గుర్తించాల్సి ఉంది. ప్ర‌మాద ఘ‌ట‌న తెలుసుకొని తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ అక్కడికి చేరుకుని, స‌హాయ చర్య‌ల‌ను చేపట్టారు.

Exit mobile version