Site icon Prime9

Bandi Sanjay: సచివాలయ నిర్మాణంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: సాగర తీరాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన.. తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి సిద్దమైంది. సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల కలబోతతో రూపుదిద్దుకున్న ఈ సచివాలయాన్ని ఏప్రిల్ 30 న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా సెక్రటేరియట్ నిర్మించారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. సచివాలయంలో హిందువుల వాటా రెండు గుంటలేనని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కట్టిన కొత్త సచివాలయంలోకి తాము అడుగుపెట్టమని బండి తేల్చి చెప్పారు.

 

 

ట్రాఫిక్ ఆంక్షలు(Bandi Sanjay)

కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయ భవనం ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ ఆంక్షలు వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్‌ వరకు ఇరువైపులా అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను ఆపుతారు. ప్రారంభానికి వచ్చే ఆహ్వానితుల కోసం పార్కింగ్‌ స్థలాలు కేటాయించామని.. సచివాలయానికి వచ్చే గెస్టులు తమ పాస్‌లను కార్‌ డోర్లకు అతికించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

 

పార్కులు మూసివేత(Bandi Sanjay)

సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా సచివాలయ పరిసరాల్లో నెలకొనే రద్దీని దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆదివారం లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షో లను మూసి వేస్తున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది.

 

Exit mobile version
Skip to toolbar