Site icon Prime9

Bandi Sanjay: కేసీఆర్ కోసం శాలువా కూడా తెచ్చా.. కానీ ఆయన రాలేదు: బండి సంజయ్

bandi sanjay

bandi sanjay

Bandi Sanjay: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు డుమ్మా కొట్టడంపై ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ వస్తారని ఆయన కోసం శాలువా కూడా తీసుకొచ్చినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.

బండి సంజయ్ సెటైర్లు.. (Bandi Sanjay)

సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు డుమ్మా కొట్టడంపై ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ వస్తారని ఆయన కోసం శాలువా కూడా తీసుకొచ్చినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. మోదీ సభకు సీఎం ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధాని తెలంగాణకు వస్తే.. కేసీఆర్ కు అంత ముఖ్యమైన పని ఏంటని ప్రశ్నించారు. నేటి సీఎం కార్యక్రమాలు ఏంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ సభకు కేసీఆర్ వస్తారని తాను ఎదురు చూసినట్లు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ వస్తే.. స్వయంగా సన్మానించేందుకు శాలువా కూడా తీసుకువచ్చినట్లు తెలిపారు.

తెలంగాణలో రూ. 11 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ అభివృద్ధి నిరోధకుడిగా మారాడు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. కానీ రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదు’ అని ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజం

ఆ తర్వాత మోదీ మాట్లాడుతూ.. ప్రియమైన సోదర, సోదరీమణులారా మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.

‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఒకే రోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించాం. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చేశాం.

తెలంగాణలె నాలుగు హైవేలకు శ్రీకారం చుట్టాం. హైదరాబాద్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కూడా అమల్లో ఉంది. పరిశ్రమలు, వ్యవసాయాభివృద్ధికి కేంద్రం చేయూత ఇస్తోంది.

దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే 7 మెగా టెక్స్ టైల్స్ పార్కులతో పాటు తెలంగాణలో కూడా మోగా టెక్స్ టెల్స్ పార్కు ఏర్పాుటు చేస్తున్నాం.

కానీ, తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు. అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది.

Exit mobile version
Skip to toolbar