Hyderabad: మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్లో తన పాత్ర లేదని లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్ విసిరారు. పోలీసులు అడ్డుకున్నా సరే వెళ్లి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ నుంచి యాదాద్రికి బండి సంజయ్ వెళ్తారు. యాదాద్రి ఆలయానికి వెళ్లి తమ నిజాయితీని నిరూపించుకుంటామని బండి సంజయ్ తేల్చి చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. దీంతో హైద్రాబాద్ కేంద్రంగా కుట్రలు చేస్తున్నారన్నారు. తనను అడ్డుకొనేందుకు పోలీసులకు సీఎంఓ నుండి పోలీసులకు ఆదేశాలు అందాయన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నుండి టీఆర్ఎస్ తప్పుుకోవాలని కేసీఆర్ కు ఆయన సూచించారు.
హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌ్‌సలో బుధవారం జరిగింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు , బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావును ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని చెబుతున్నారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని, దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు.
మొయినాబాద్ ఫాంహౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ముగ్గురిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పీడీ యాక్ట్ వర్తించదని నిన్న రాత్రి జడ్జి చెప్పారు. ముగ్గురు నిందితులను విడుదల చేయాలని ఆదేశించారు. అంతేకాదు 41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద విచారణ చేయాలని జడ్జి కోరారు.