Site icon Prime9

Union minister Kishan Reddy: వ్యూహం ప్రకారమే ఈటెల పై దాడి జరిగింది.. కిషన్ రెడ్డి

Attack was carried out on the spears according to the strategy

Munugode: మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌ పై పలివెల గ్రామంలో జరిగిన దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. ఓ పథకం ప్రకారం ఈటల పై దాడి చేశారని ఆయన మండిపడ్డారు. డీసీఎం, వ్యాన్లలో రాళ్లు, కర్రలు తెచ్చుకుని దాడి చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు.

గొడవ జరగవద్దనే ఉద్దేశంతోనే ఈటల సంయమనం పాటించారని చెప్పారు. టీఆర్ఎస్ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతల ఫోన్లను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోం కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈటల, ఆయన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఎన్నికల వేళ తెరాస నేతల కార్లను పోలీసుల తనిఖీలు చేయడం లేదు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పలివెల గ్రామంలో తెరాసకు ఓట్లు రావని తెలిసి ఈ దాడులకు పాల్పొడ్డారు. హుజూరాబాద్ ఫలితంతో తెరాస కాలుకాలిన పిల్లిలా తయారైందన్నారు. ఎన్ని దాడులు చేసినా భాజపా కార్యకర్తలు భయపడరని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Attack on Etela Rajender Convoy: ఈటెల కాన్వాయిపై రాళ్ల దాడి..పలివెలిలో ఘటన

Exit mobile version