Site icon Prime9

Fire Accident: హైదారాబాద్ లో మరో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

fire accident in jubilee hills

fire accident in jubilee hills

Hyderabad: సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో జరిగిన అగ్రిప్రమాదం మరువకముందే, హైదరాబాద్ నగరంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లో ఉన్న ఓ పబ్‌లో అగ్నికిలలు ఎగసిపడ్డాయి.

హైదరాబాద్‌ సికింద్రాబాద్ జంట నగరాల్లో వరుస అగ్నిప్రమాదాలు నగర ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కాగా మంగళవారం రోజు మధ్యాహ్నం నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లో ఉన్న ఓ పబ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లీ 800 పబ్‌లోని మూడో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదు. మంటలు చెలరేగిన సమయంలో పబ్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఆ భవనం ఖాళీగా ఉందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం పై ప్రధాని దిగ్బ్రాంతి.. రూ.2లక్షల ఆర్థికసాయం

Exit mobile version