Prime9

TRS MLAs poaching case: శాసనసభ్యుల కొనుగోలు ప్రలోభాల డీల్ కేసు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన నిందితులు

New Delhi: తెలంగాణలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ కేసులోని నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలు ముగ్గురు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.

నిందితుల అరెస్ట్ చేసేందుకు కోర్టు పోలీసులకు అనుమతి ఇవ్వడంతో వారు సుప్రీం కోర్టు మెట్లెక్కారు. పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ముందు ప్రస్తావించగా, శుక్రవారం చేపట్టే కేసుల విచారణ జాబితాలో నిందుతల కేసును చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. MLAs poaching case: కౌంటర్ వేయండి, అనంతరమే దర్యాప్తు చేపట్టండి.. ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ కేసులో హైకోర్టు ఆదేశాలు

నలుగురు తెరాస పార్టీ ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పోలీసులు అరెస్ట్ చేసిన నిందుతులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆధారాలు సరిగాలేవన్న కారణంగా తిరస్కరించింది. దీని పై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం నిందితుల అరెస్ట్ కు ఉన్నత న్యాయస్ధానం అనుమతించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల పై నిందితులు ముగ్గురూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: Minister Jagadish Reddy: మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ఇంట్లో ఐటీ సోదాలు

Exit mobile version
Skip to toolbar