Site icon Prime9

Delhi liquor scam: లిక్కర్ స్కాంలో అభిషేక్ రావుదే కీలకపాత్ర.. కస్టడీ రిపోర్టులో సీబీఐ

Abhishek Rao is the key player in the liquor scam. CBI in custody report

Abhishek Rao is the key player in the liquor scam. CBI in custody report

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం, రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయనేతలు, బడాబాబుల గుండెల్లో గుబులు రేపుతుంది. లిక్కర్ స్కాంలో హైదరాబాదుకు చెందిన అభిషేక్ రావుదే కీలకపాత్రగా సీబీఐ గుర్తించింది. ఈమేరకు కస్టడీ రిపోర్టులో సీబీఐ పేర్కొనింది. సౌత్ లాభీ పేరుతో అభిషేక్ రావు ఈ లావాదేవీలు సాగించిన్నట్లు సీబీఐ అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. రూ. 3.80కోట్ల రూపాయల నగదును హవాలా ద్వారా దారి మళ్లించిన్నట్లు సీబీఐ రిపోర్టులో పేర్కొనింది. సమీర్ మహేంద్రో, దినేష్ అరోరాతో కలసి ఈ మేరకు లావాదేవీలు సాగించిన్నట్లు అధికారులు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు.

ఆప్ పార్టీ పై దృష్టి పెట్టిన కేంద్రం, లిక్కర్ స్కాంలో ఆ పార్టీకి చెందిన పలువురి హస్తం ఉందంటూ సీబీఐ దాడులు చేసింది. ఈ దాడుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలువురికి సంబంధాలు ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. దీంతో ఏపీ, తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ప్రధానంగా హైదరాబాదులోని ప్రముఖుల ఇండ్లు, కార్యాలయాల పై సీబీఐ అధికారులు సోదాలు చేశారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకొన్నారు.

ఇందులో తెరాస పార్టీకి చెందిన కీలక నేతల ఆడిటర్ కార్యాలయంలో కూడా సీబీఐ తనిఖీలు చేపట్టింది. కేంద్రంలోని భాజపా నేతలు కొందరు సీఎం కేసిఆర్ కూతరు కవిత కూడా లిక్కర్ స్కాంలో ఉన్నట్లు పేర్కొనడం కూడా ఓ సంచలనంగా మారింది. తనిఖీలు, వాంగ్మూలాలు సేకరించిన పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇందులో హైదరాబాదుకు చెందిన అభిషేక్ రావు అనే వ్యక్తిని కూడా సీబీఐ అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. రెండు రోజుల విచారణ అనంతరం కస్టడీ రిపోర్టును సీబీఐ విడుదల చేసింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలతో అభిషేక్ రావుకు సత్సంబంధాలు ఉండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

నివేదికలో లిక్కర్ స్కాంకు సంబంధించిన కీలకాంశాలు బయటపడ్డాయి. నవంబర్ 2001 నుంచి జులై 2022 వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లిక్కర్ స్కాం పై విజయ్ నాయర్, దినేష్ అరోరా, అభిషేక్ రావుల మధ్య మీటింగులు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కాంలో అభిషేక్ రావు కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ విచారణలో తేలింది. తొలుత సీబీఐ అధికారులు అభిషేక్ రావును నగదు వ్యవహారాల పై పలు దఫాలుగా ప్రశ్నించారు. అయితే అతని నుండి సరైన సమాధానం రాకపోవడంతో సీబీఐ కోరిన నేపథ్యంలో అభిషేక్ రావును రెండు రోజుల విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఇది కూడా చదవండి:  రూ.2.4కోట్ల హవాలా నగదు పట్టివేత

Exit mobile version