Site icon Prime9

Nizamabad Girl Death: హోంవర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన టీచర్.. చికిత్స పొందుతూ మృతి

7-Year-Old-Girl-Dies-After-Beaten-By-Teacher

Nizamabad: తాను ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని ఆగ్రహంతో ఒక ఉపాధ్యాయురాలు రెండో తరగతి చదువుతున్న బాలికపై తన ప్రతాపం చూపెట్టింది. ఆమె విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి ఆసుపత్రి పాలైంది. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

నిజామాబాద్ అర్సపల్లిలోని ఫుట్ బ్రిడ్జ్ పాఠశాలలో మంతాష (7) అలియాస్ ఫాతిమా రెండో తరగతి చదువుతోంది. ఫాతిమా హోం-వర్కు చేయకపోవడంతో గత శుక్రవారం ఓ టీచర్ విపరీతంగా కొట్టింది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చాక ఫాతిమా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫాతిమా సోమవారం రాత్రి కన్ను మూసింది. ఫాతిమా అంత్యక్రియలను మంగళవారం నిజామాబాదులో పూర్తి చేశారు.

ఈ ఘటన పై విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఫుడ్ బ్రిడ్జి పాఠశాలను సీజ్ చేయాలని డీఈఓ ఎన్వీ దుర్గాప్రసాద్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version