Hyderabad: 2023లో జరగనున్న 10వ తరగతి పరిక్షల్లో 6 పేపర్లే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనింది. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.
కరోనా మహమ్మరి కారణంగా 2021, 2022 సంవత్సరాల్లో 11 పేపర్ల స్థానంలో 6 పేపర్లకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనింది. 2021లో మాత్రం పరిక్షలను నిర్వహించలేదు. అనంతరం జరిగిన 10వ తరగతి పరిక్షల్లో 6 పేపర్లనే విద్యాశాఖ కొనసాగించింది. తిరిగి రానున్న 2023 పరిక్షల్లో కూడా విద్యార్ధులు 6 పేపర్లు మాత్రమే వ్రాసేలా విద్యా శాఖ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.
గతంలో హిందీ సబ్జెక్టుకు 1 పరిక్షగాను, మిగిలిన తెలుగు, ఇంగ్లీషు, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జక్టులలో రెండు పేపర్లుగా పరిక్షలు నిర్వహించేవారు. కరోనా సమయంలో ఇలాంటి చర్యలు పర్వాలేదు గాని, ఇంకను అదే విధంగా కొనసాగిస్తే, విద్యార్ధుల పై పరిక్షల సమయంలో వత్తిడి పెరుగుతుంది. ప్రధానంగా సైన్సు విభాగంలో వారు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. భవిష్యత్ పోటీ పరిక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతాన్ని వారు అందుకోలేకపోవచ్చు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో నేటి నుంచి విధుల్లోకి విఆర్ఏలు