Site icon Prime9

Bandi Sanjay padayatra: నేటి నుంచి బండి సంజయ్ నాల్గవవిడత పాదయాత్ర

4thphase-padayatra

Hyderabad: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇవాళ్టి నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయన మూడు దఫాలుగా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగో విడత పాదయాత్రకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో పాదయాత్ర కొనసాగనుంది. గణేష్, విజయదశమి నవరాత్రుల నేపథ్యంలో ఈసారి యాత్రను పది రోజులకే కుదించారు.

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగనంది. ఈ పాదయాత్ర షెడ్యూల్ ను మనోహర్ రెడ్డి విడుదల చేశారు. ఇవాల్టి నుంచి 22వ తేదీ వరకు 10 రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చిట్టారమ్మ ఆలయం వద్ద బండి సంజయ్ ప్రత్యేక పూజలను నిర్వహించి పాదయాత్రను ప్రారంభిస్తారు.

Exit mobile version