Rahul Gandhi In Kadapa: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. కడప లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. బీజేపీ కీ బీ టీం గా చంద్రబాబు, పవన్, జగన్ పనిచేస్తున్నారని రాహుల్ విమర్శించారు. ప్రత్యేక హోదా పై జగన్ ఏనాడు కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు. ఈ పదేళ్లలో ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదని ఈ సందర్భంగా రాహుల్ ప్రశ్నించారు. పోలవరం కూడా పూర్తి కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే కడప స్టీల్ ఫ్యాక్టరీ, పోలవరం పూర్తి చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు . ప్రతి ఏడాది మహిళలకు లక్ష రూపాయలు ఇస్తామన్నారు. రైతురుణమాఫీ,రైతులకు కనీస మద్దతు కల్పిస్తామని చెప్పారు . 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు .ఉపాధి హామీ పధకం కూలీ రేటు రూ.400 కు పెంచుతామని హామీ ఇచ్చారు. అంగన్ వాడీల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు.
రాజశేఖర్ రెడ్డి యాత్ర స్ఫూర్తితోనే..(Rahul Gandhi In Kadapa)
సీబీఐచార్జ్ షీట్ లో వైఎస్సార్ పేరును కాంగ్రెస్ చేర్చలేదన్నారు రాహుల్ గాంధీ వెల్లడించారు . హస్తం, వైఎస్సార్ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేయబోదన్నారు. రాజశేఖర్ యాత్ర స్ఫూర్తితోనే తాను యాత్ర చేశానని చెప్పారు రాహుల్. తన తండ్రి రాజీవ్ గాంధీ కి వైఎస్సార్ మంచి స్నేహితుడు అని వివరించారు . రాజశేఖర్ రెడ్డిని చూస్తూ పెరిగానని అన్నారు . తన పాదయాత్రతో పేదల కష్టాలను చూశానన్నారు . పాదయాత్రలో పేదలకు దగ్గరయ్యా నని చెప్పారు . రాజశేఖర్ రెడ్డి పాలన దేశానికే ఆదర్శమని , ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ సేవలు మరువలేమన్నారు రాహుల్ గాంధీ.
షర్మిల నా చెల్లెలు..
మోదీ రాజ్యాంగాన్నినాశనం చేయాలని చూస్తున్నాడని రాహుల్ విమర్శించారు . పేదలకు హక్కులు లభించేది రాజ్యాంగం వల్లేనని వివరించారు . భారత రాజ్యాంగాన్ని మోదీ కాదు ప్రపంచంలో ఎవరూ మార్చలేరన్నారు. షర్మిల పార్లమెంట్ లో ఉండాలి.. షర్మిల నా చెల్లెలు, లోక్ సభకు పంపించాలి. ఏపీ ప్రజల ఆలోచనను ఢిల్లీ పార్లమెంట్ లో వినిపిస్తుంది. షర్మిలను సీబీఐ, ఈడీ ఏం చెయ్యలేదని చెప్పారు రాహుల్.