Site icon Prime9

Amit Shah Meeting: కేంద్రమంత్రి అమిత్ షాతో రాజమౌళి, ప్రభాస్ భేటీ ?

Amit Shah Meeting

Amit Shah Meeting

Amit Shah Meeting:  తెలంగాణలో పాగా వేసేందుకు గాను ఏ అవకాశాన్ని వదులుకోరాదని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తనవైపు తిప్పుకోవడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై బీజేపీ దృష్టి సారించింది.  గతంలో హైదరాబాద్ పర్య టనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మరియు నితిన్‌లను కలిసారు. ఇపుడు తాజాగా హైదరాబాద్ పర్యటనకు వస్తున్న అమిత్ షా దర్శకధీరుడు రాజమౌళి, బాహుబలి ప్రభాస్ లను కలుస్తారని సమాచారం.

చర్చనీయాంశంగా మారిన భేటీ..(Amit Shah Meeting:)

గురువారం ఖమ్మంలో జరగనున్న మహాజన్ సంపర్క్ అభియాన్‌లో అమిత్ షా పాల్గొననున్నారు. ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో దిగనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం గురువారం ఉదయం ఒక పత్రికాధిపతితో అమిత్ షా భేటీ అవుతారని అనంతరం రాజమౌళిని కలుస్తారని తెలుస్తోంది. ఈ భేటీ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే ఈ సమావేశాన్ని తెలంగాణ బీజేపీ వర్గాలు కానీ, ప్రభాస్, రాజమౌళిల పీఆర్ టీమ్ కానీ ధృవీకరించలేదు.

తెలంగాణ పర్యటనలో అమిత్ షా గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ బీజేపీ క్యాడర్‌తో సమావేశమై అనంతరం భద్రాచలం వెళ్లనున్నారు. అక్కడ రాములవారిని దర్శించుకుని అనంతరం బహిరంగ సభ కోసం ఖమ్మం వెళ్లనున్నారు.

అమిత్ షా తో ప్రభాస్,రాజమౌళి భేటీ ?  ఏపీలో మొదలైన ప్రకంపనలు | AmithSha Meet Prabhas,Rajamouli

Exit mobile version
Skip to toolbar