Prashant Kishore: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్‌నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గత ఎన్నికల్లో వైసిపి గెలుపులో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్రని పోషించారు. వైసీపీకి పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా నారా లోకేష్ వెంట కనిపించడంతో వైసిపి నేతలు షాక్ తిన్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ వైపు..(Prashant Kishore)
ఒకే వాహనంలో ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ కలిసి ఎయిర్ పోర్టునుంచి రోడ్డుమార్గాన విజయవాడకి వెళ్ళారు. చంద్రబాబుతో ఆయన నివాసంలో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు.ఏపీలో తాజా రాజకీయాలపై చర్చించారు. గత ఎన్నికల్లో వైసిపి గెలుపులో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్రని పోషించారు. వైసిపికి పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా నారా లోకేష్ వెంట కనిపించడంతో వైసిపి నేతలు షాక్ తిన్నారు. హైదరాబాద్‌నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ఒకే వాహనంలో రోడ్డుమార్గాన విజయవాడకి వెళ్ళారు. చంద్రబాబుతో ఆయన నివాసంలో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
సమావేశం ముగిసిన తరువాత గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సీనియర్ నేత అని అందుకే మర్యాదపూర్వకంగా కలిసానని చెప్పారు. దీనిపై ఎటువంటి ఊహాగానాలు వద్దని అన్నారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడని మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.