PM Modi’s Road Show: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి కాచిగూడ వరకు 2 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్‌షో సాగింది. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. ప్రధాని మోదీపై అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.
మెట్రో స్టేషన్ల మూసివేత..(PM Modi’s Road Show)
మోదీ వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ రోడ్ షోలో పాల్గొన్నారు. కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న మోదీ.. సావర్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రధాని మోడీ రోడ్‌షో నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రత చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.రోడ్‌షో సజావుగా జరిగేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో గత రెండు రోజులుగా పాల్గొన్నారు.తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.