Perni Nani: టీడీపీ, జనసేన పొత్తులపై మాజీ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. పవన్ చంద్రబాబును ఓదార్చడానికి వెళ్లారనుకున్నామని అయితే ఓదార్చడానికి వెళ్లారా లేక బేరం కుదర్చుకోవడానికి వెళ్లారా అంటూ నాని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పవన్ ది ములాఖత్ కాదు మిలాఖత్ అని తేలిందన్నారు.
కలవడం.. విడిపోవడం ముసుగు మాత్రమే..(Perni Nani)
బీజేపీతో పవన్‌ది తాత్కాలిక పొత్తు మాత్రమే అని తెలుగుదేశంతోనే పవన్‌కు శాశ్వత పొత్తు ఉందని పేర్ని నాని అన్నారు. ఈ విషయంలో పవన్ కు పూర్తి క్లారిటీ ఉందని బీజేపేకే లేదని అన్నారు. బీజేపీ ఎప్పటికప్పుడు పిల్లిమొగ్గలు వేస్తోందన్నారు. టీడీపీతో పవన్ పొత్తు పాత వార్తేనని ఇందులో కొత్త దనం లేదన్నారు. తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ అంతర్బాగమని కలవడం,విడిపోవడం కేవలం ముసుగు మాత్రమేనని అన్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానన్న పవన్ అవినీతి పరుడైన చంద్రబాబు నాయుడుకు మద్దతు ఎలా ఇస్తారు? లోకేష్ తో సీట్లేనా లెక్కలు కూడా పంచుకున్నారా అంటూ నాని ప్రశ్నించారు.