Site icon Prime9

Pawan Kalyan’s Varahi Yatra: విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర

Varahi Yatra

Varahi Yatra

Pawan Kalyan’s Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 10వ తేదీ నుంచి విశాఖ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. యాత్రలో భాగంగా 6 ఫీల్డ్ విజిట్స్ , 2 బహిరంగ సభలు, ఒక జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇప్పటికే రెండు విడుతల విజయవంతం కాగామూడో విడతను కూడా ప్రకటించింది. ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు విశాఖపట్నంలో సభను నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ తెలపింది. ఆగస్టు 19వ తేదీ వరకూ మూడో విడప వారాహి విజయ యాత్ర సాగనుంది. ఈ యాత్ర విజయవంతం చేయడానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులతో నాదెండ్ల మనోహర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

విశాఖలో జనవాణి..(Pawan Kalyan’s Varahi Yatra)

యాత్రలో భాగంగా విశాఖలో జనవాణి కార్యక్రమం ఉంటుందని నాదెండ్ల చెప్పారు. అదే విధంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టి, సంబంధిత ప్రజలతో పవన్ కళ్యాణ్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారన్నారు అన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో నిర్వహించిన వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగిందని అన్నారు. అంతకు మించిన స్థాయిలో విశాఖ నగరంలో చేసే యాత్ర ఉండాలని పార్టీ నాయకులకు నాదెడ్ల సూచించారు. నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా సమష్టిగా పని చేసి.. వారాహి యాత్ర ఉద్దేశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version