Site icon Prime9

Harirama Jogaiah: 2024లో పవన్‌ కళ్యాణ్‌ ఏపీకి సీఎం అవుతారు.. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య

Hariramazogaiah

Hariramazogaiah

AP Political News: 2024లో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఏపీకి సీఎం అవుతారంటూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు పవన్ కళ్యాణ్‌కు ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎందుకు అధికారంలోకి వస్తుందో చెబుతూ తాను చేసిన విశ్లేషణను వివరించారు హరిరామజోగయ్య.

వైఎస్‌ఆర్‌ కుటుంబానికి అవినీతి చేయడం వెన్నతో పెట్టిన విద్య అంటూ హరిరామజోగయ్య ఎద్దేవా చేశారు. రాజారెడ్డి దగ్గరి నుంచి ఇప్పడు సీఎం జగన్‌ వరకూ ప్రతీ ఒక్కరు అవినీతిలో కూరుకుపోయారన్నారు. వైఎస్‌ కుటుంబ అవినీతికి తానే ప్రత్యక్ష సాక్షినన్నారు. రాజారెడ్డి మైనింగ్‌ కంపెనీలో అవకతవకలు జరిగిన సమయంలో తాను మైనింగ్‌ మినిస్టర్‌గా ఉన్నానన్నారు. అప్పటి అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు రాజారెడ్డి కంపెనీకి కోటి రూపాయలు జరిమానా కూడా విధించానన్నారు.రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞాన్ని ప్రారంభించారని హరిరామజోగయ్య ఆరోపించారు. పనులు మొదలు పెట్టకుండానే పనులు జరుగుతున్నట్టు ఆధారాలు చూపి.. కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేశారని చెప్పారు. కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమీషన్లు తీసుకుని కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారన్నారు.

పోలవరం విషయంలో కూడా ఇదే జరిగిందని హరిరామజోగయ్య అన్నారు. కాలువలు తీయకుండానే తీసినట్టు చెప్పి నిధులు మింగేశారని చెప్పారు. రాజశేఖర్‌ రెడ్డి అక్రమంగా సంపాదించిన సొమ్ము ఆయన చనిపోయిన తరువాత జగన్‌ సొంతమైందన్నారు. బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకునేందుకు హైదరాబాద్‌, బెంగళూరులో విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారని చెప్పారు. రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడా జగన్‌ చాలా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఆ డబ్బుతోనే వైఎస్‌ఆర్‌సీపీ, సాక్షి పేపర్, సాక్షి న్యూస్ ఛానల్ స్థాపించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీలో జెండా ఎగరేసి తీరుతుందని హరిరామజోగయ్య ధీమా వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ కళ్యాణ్‌ అయ్యేందుకు కాపులు మొత్తం ఆయనకు అండగా నిలబడతారన్నారు.

Exit mobile version