Pawan Kalyan- Chandrababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి ఉండవల్లిలోని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సోమవారం టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాని విడుదల చేసే అవకాశాలున్నాయి.
భోగి మంటల కార్యక్రమంలో..(Pawan Kalyan- Chandrababu)
చంద్రబాబు, పవన్ ఆదివారం ఉదయం మందడంలో నిర్వహించే సంక్రాంతి భోగి మంటల కార్యక్రమంలో కలిసి పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులను భోగి మంటల్లో దహనం చేయనున్నారు. జగన్ మోసపూరిత హామీలు, పెత్తందరీ పోకడలు, నిరుద్యోగ సమస్య, గంజాయి మాఫియా, అధిక ధరలు, పన్నుల బాదుడు, జె బ్రాండ్స్, రైతు సంక్షోభం, అహంకారం నశించాలి వంటి అంశాలతో కూడిన ప్ల కార్డులను కూడా భోగి మంటల్లో వేసి దహనం చేయనున్నారు. అనంతరం ఇరువురు నేతలు రైతులతో ముచ్చటిస్తారు.