Veera Simha Reddy: వీరసింహారెడ్డి సినిమాపై కొందరు నెగిటివిటీ సృష్టించడాన్ని మరియు మరికొందరు వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లపై నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సినిమాలు అంటే వినోదం, అన్ని హద్దులను చెరిపేయడం అని ఆయన పేర్కొన్నారు. డర్టీ, విభజన రాజకీయాలకు మనం బలి కాకూడదని తెలిపారు. మనమందరం ఒక్కటేనని.. కులాలు, మతాలు, ప్రాంతాలు మనల్ని విభజించకూడదని గుర్తుంచుకోండి అంటూ లోకేష్ తెలిపారు.
వైసీపీ దుష్టశక్తుల కుట్రలను తిప్పికొట్టాలి
ఫేక్ SM ఖాతాలు మరియు రెచ్చగొట్టే కంటెంట్‌తో ఒక వర్గానికి వ్యతిరేకంగా మరొక వర్గాన్ని ఎగదోస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానుల మధ్య కులాల ప్రస్థావణ తెస్తూ యుద్ధాలను ప్రేరేపించడానికి అధికార పార్టీకి చెందిన దుష్టశక్తులు సిద్ధమవుతున్నాయని కూడా మనం గమనించాలని నారాలోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. అటువంటి ఖాతాలను గుర్తించి.. మోసపోకుండా ఉండవలసిందిగా అందరినీ వినయంగా అభ్యర్థిస్తున్నా అని ఆయన అన్నారు.
సినిమాను సినిమాలాగే చూడాలని వీరసింహారెడ్డి సినిమా బాగుందని అందరూ ఈ సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చెయ్యాలని ఆయన చెప్పారు. అలాగే మా మామ బాలకృష్య నటించిన వీరసింహారెడ్డి మరియు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలకు ఆయన అభినందలను తెలియజేశారు. ప్రేక్షకులను ఈ రెండు సినిమా ఈ సంక్రాంతి పండుగకు మరింత జోష్ ఫుల్ మాస్ యాక్షన్, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని ఆశిస్తున్నాని ఆయన పేర్కొన్నాను.
ఇవీ చదవండి:
Veera Simha Reddy: థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్
Ram Charan-Upasana: నాతో కలిసి నా బిడ్డకూ ఇది స్పెషల్ ఎక్స్ పీరియన్స్.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్
Veera Simha Reddy Unstoppable 2 Promo: వీరసింహారెడ్డి టీమ్‌తో బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోలో రచ్చ మాములుగా లేదుగా
Chiranjeevi Pawan kalyan: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లుపై చిరంజీవి ఏమన్నారంటే?
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/