Janasena: విశాఖలో నాదెండ్ల మనోహర్‌తోపాటు జనసేన నాయకుల అరెస్టు

విశాఖ పట్నంలోని నొవాటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ సత్యనారాయణ ఎంవీబీ వెంచర్ సంబంధించిన రోడ్డును బ్లాక్ చేశారని.. నిరసన వ్యక్తం చేసేందుకు బయలుదేరిన జనసేన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలను పోలీసులు అడ్డుకున్నారు.

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 03:05 PM IST

Janasena: విశాఖ పట్నంలోని నొవాటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ సత్యనారాయణ ఎంవీబీ వెంచర్ సంబంధించిన రోడ్డును బ్లాక్ చేశారని.. నిరసన వ్యక్తం చేసేందుకు బయలుదేరిన జనసేన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలను పోలీసులు అడ్డుకున్నారు.

విశాఖ వస్తా..పోరాడుతా..(Janasena)

ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడతూ ప్రజా సమస్యలను తీర్చాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే వాటికోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్దితి రాష్ట్రంలో నెలకొని ఉందని అన్నారు.విశాఖ నగరవాసులకు ఎంతో అవసరమైన టైటాన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలకు లేనిపోపి సమస్యలు తెచ్చిపెట్టిన ప్రబుత్వం ఎవరికోసం ఇంత నాటకం ఆడుతుందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఇలాఉండగా నాదెండ్ల మనోహర్, ఇతర నేతలను అరెస్ట్ చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ అరెస్టులు అప్రజాస్వామికమని అన్నారు. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ గారితో పాటు, ఇతర నేతలను విడుదల చేయకపోతే విశాఖ వస్తాను..పోరాడతాను అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.