Mudragada Padmanabham:చంద్రబాబు అధికారం అనే ఆకలితో అలమటిస్తున్నారని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. 1978లో. చంద్రబాబు ఇంటి పెంకులు కూడా వేయించుకునే స్థితిలో లేరు. ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు అయిపోయారు. ఈ సంపాదన ఎలా సాధ్యపడింది..?మాకు కూడా చెప్తే రాజకీయాలు వదిలేసి మేము కూడా సంపాదించుకుంటామని ముద్రగడ అన్నారు. టిడిపిలో ఎన్టీఆర్ ఆలోచనలను,అభిప్రాయాలను చంద్రబాబు తొక్కేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో నిలబడి చిత్తు చిత్తు గా ఓడిపోతే టీడీపీలో చేరి మావని వెన్నుపోటు పొడిచి ఆయన కుమిలి కుమిలి చనిపోయే వరకు విసిగించారని ఆరోపించారు.
మీరు రెండుచోట్ల నటిస్తున్నారు..(Mudragada Padmanabham)
సినిమాలలో నటించాలి. రాజకీయాలలో జీవించాలి. మీరు రెండు చోట్ల నటిస్తున్నారని పవన్ కళ్యాణ్ పై ముద్రగడ సెటైర్లు వేసారు. పదవులు ఆశించకుండా జనసేనకు సేవ చేస్తానని చెప్పాను. పిఠాపురంలో నా పని చేసుకుంటూ పోతున్నాను. నా సలహాలు కోసం. నా సాయం కోసం వస్తారని చూశాను. కాపు ఉద్యమాన్ని ఉక్కు పాదం తో అణచి వేసిన వ్యక్తి తో జత కడుతారా ?సినిమా డైలాగులు రాజకీయం లో వాడకూడదు. అమాయక ప్రజలను, యువత జీవితాలతో అడుకోకండి అంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు. 2014 నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జేబు లో ఉన్నారు. ఆయన గ్లాస్ గుర్తు బదులు సైకిల్ గుర్తు పై పోటీ చేస్తే బాగుంటుందని ముద్రగడ పేర్కొన్నారు.