Site icon Prime9

Mekapati Chandrashekar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి భార్య కొడుకుని అంటూ.. బహిరంగ లేఖ.

Mekapati Chandra Sekhar Reddy | మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

mekapati chandra shekar reddy first wife son

Mekapati Chandrashekar Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైయస్ కుటుంబానికి విధేయుడు. గతంలో వై.యస్.ఆర్ ప్రభుత్వంలో 2 సార్లు గెలిచి, వై.యస్.ఆర్ మరణం తరువాత జగన్ కి జై కొట్టి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఈయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఉదయగిరి నియోజకవర్గంలో గెలిచారు.

మొదటి కొడుకు అంటూ లెటర్ వైరల్ 

రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రత్యర్థుల్ని ఇరకాటం లో పెట్టె వైసీపీ పార్టీ కి ఇప్పుడు మరో నాయకుడి వల్ల ఎదురు దెబ్బ తగిలిందా ?

ఈ పరిణామం చూస్తే నిజమే అనిపిస్తుంది.

ఇప్పటికే వైసీపీ లో పెద్ద పెద్ద నాయకుల వ్యక్తిగత ఆడియో లీకులు, వీడియో కాల్ లు అంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్న సమయంలో మరో తలనొప్పి వచ్చి పడింది.

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మొదటి భార్య కొడుకుని అంటూ మేకపాటి శివ చరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాసాడు.

లేఖలో తనకి అతి చిన్న వయసులో హాస్టల్ లో ఉంచేశారు అని, అప్పటి నుంచి తన చదువు పూర్తి అయ్యి, వివాహం అయ్యి, తనకి కొడుకు పుట్టే సమయంలో కూడా తన తండ్రిని ( మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి / Mekapati Chandrashekar Reddy ) మిస్ అయ్యాను అని అతను పేర్కొన్నాడు.

ఇప్పటి వరుకు ఫోన్ చేసినా, కలవడానికి వెళ్లినా కోప్పడి పంపేసేవారు అని పేర్కొన్నాడు.

తన తల్లి తో 18 సంవత్సరాలు కలిసి ఉండి విడిచిపెట్టారు అని, అప్పటి నుండి తమని రహస్యంగా ఉంచారని కుటుంబ పరువు కోసం తాము బయటకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసాడు. ఆస్తిలో కానీ రాజకీయంగా కానీ తనకు వారసత్వం తనకి లేదని ఆవేదన వ్యక్తపరిచాడు. తర్వాత మీరొక కుటుంబాన్ని స్వాగతించి పబ్లిగ్గా (Public) సంతోషంగా ప్రకటించారు. అయితే ఒక ఇంటర్వ్యూలో తనకి కొడుకులు లేరు అన్నారు మరి నేను ఎవరిని అని లేఖలో పేర్కొన్నాడు. నేను మీ కొడుకుని, నా బాధను నన్ను అర్థం చేసుకోండి అని లేఖలో అతను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని అభ్యర్ధించాడు. ఈ పరిణామంపై ఎప్పుడూ పక్కవారి వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేసే వైసీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో అని వేచి చూడాల్సి ఉంది..

ఇవి చదవండి

Kuppa Thotti Roja : మంత్రి రోజాకి గట్టిగా ఇచ్చిన నాగబాబు… నీది నోరు కాదు చెత్తకుప్ప తొట్టి అంటూ

Jogi Ramesh : చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాల్సిందే…

Ambati Rambabu : చంద్రబాబు పిచ్చి కుక్కలా అరుస్తున్నాడన్న అంబటి రాంబాబు

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version