Site icon Prime9

Janasena: జనసేన పార్టీ కార్యాలయానికి క్యూ కట్టిన నేతలు

Janasena

Janasena

 Janasena: మంగళగికి జనసేన పార్టీ కార్యాలయానికి బుధవారం పలువరు నేతలు క్యూ కట్టారు. పవన్ కళ్యాణ్ తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సమావేశమయ్యారు. జనసేన పార్టీలో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మంచిరోజు చూసుకుని పార్టీలో చేరుతారని సమాచారం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ను మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కలిశారు. త్వరలో జనసేన పార్టీలో చేరుతానని కొణతాల రామకృష్ణ ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్ లో కొణతాల పవన్ తో సమావేశమయి పలు అంశాలపై చర్చించారు. నేడు జనసేనాని పవన్ కళ్యాణ్ తో మరోసారి భేటీ అయ్యారు.

రాబోయే కాలంలో..( Janasena)

మరోవైపు జనసేన పార్టీలో డాన్స్ మాస్టర్ జానీ చేరారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. డాన్స్ మాస్టర్ జానీ గత కొద్ది కాలంగా జనసేనకు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సమక్షంలో నటుడు పృథ్వీరాజ్ జనసేన పార్టీలో చేరారు.పవన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వెలువడనుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో అధికార వైసీపీలో సీటు దక్కనివారు, అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు జనసేన వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేనలో పలువురు నేతలు చేరే అవకాశముందని తెలుస్తోంది.

Exit mobile version